అలా వాళ్లు సిటీలో అడుగుపెట్టగానే, అద్దె ఇల్లు వెతికారు, ఆ రోజు సాయంత్రానికల్లా వాళ్ళకి పంజాగుట్ట ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు అద్దెకి దొరికింది. ఆ తరవాత ఒక వారం రోజుల్లో చంద్రమోహన్ వాళ్ల దూరపు బంధువుల సహాయం తో ఒక ప్రైవేటు కంపెనీ లో సెక్యూరిటీ గార్డు గ ఉద్యోగం సంపాదించాడు. అలా మొదలైంది గాయత్రి, చంద్రమోహన్ ల కొత్త సంసారం. పెళ్ళయ్యి సంవత్సరం తిరగక ముందే వాళ్ళకి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది. ( ఈ అమ్మాయే మన కథ కి హీరోయిన్). పుట్టిన అమ్మాయి అచ్చం చనిపోయిన తన పోలికలతో ఉందని చాలా సంతోషించింది గాయత్రి. ఆ పాపకి "సీత" అని వాళ్ళ అమ్మ పేరే పెట్టుకుంది. కాని సీత అనే పేరు పెడితే సీతమ్మ వారి కష్టాలు వస్తాయని భయపడి "వెన్నెల"గా ఆ అమ్మాయి పేరు మార్చారు. కాని ఆ అమ్మాయి ఇప్పటికి ఇంట్లో సీత అనే ముద్దు పేరు తోనే పిలవబడుతుంది. వెన్నెల పుట్టిన సంవత్సరన్నరకి, గాయత్రి కి ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి "ఆనంద్" అని పేరు పెట్టారు. ఇక గాయత్రి, చంద్రమోహన్లకు తమ ముత్యాల్లాంటి పిల్లలని చూసుకొని గర్వం, ఆనందం కలిగేవి.
**********************
గాయత్రి వాళ్ళు అద్దెకి ఉండే ఆ గది పక్కన, ఇంకొక గదిలో అద్దెకి ఉండే మరో జంట పేరు "భవాని", "నగేష్". భవాని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. నగేష్ ఒక క్రిస్టియన్. వాళ్లు విజయవాడ దగ్గర కొండపల్లి అనే చిన్న ఊరు నుంచి వచ్చారు. వాళ్ళిద్దరూ స్కూల్లో చదువుతుండగానే ప్రేమించుకున్నారు. కాలేజీ వయసు వచ్చే సరికి ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిని భవాని కుటుంబం వాళ్ళు ఆమోదించలేదు. భావానికీ ఒక అన్నా, అక్క, ఒక తమ్ముడు. వీళ్ళ ముగ్గురు తో పాటు గ, తల్లి తండ్రి కూడా భవాని తో తెగ తెంపులు చేసుకున్నారు. ఇప్పటికి ఆమె తో వల్ల అన్నా, అక్క మాట్లాడరు. నగేష్ వాళ్ళింట్లో వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు. భవాని బంగారు బొమ్మల ఉంటుంది, ఆ అమ్మాయిని చూడగానే అత్తగారింట్లో అందరికి నచ్చింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నగేష్ కి పోలీస్ కమీషనర్ ఆఫీసులో క్లెర్క్ గ ఉద్యోగం వచ్చింది. అల్లా వాళ్లు హైదరాబాద్లో గాయత్రి వల్ల పక్క వాటాలో అద్దెకి దిగారు. వీళ్ళకి కూడా ఇద్దరు కొడుకులు పుట్టారు. పెద్ద వాడి పేరు "చైతన్య", ఈ అబ్బాయి వెన్నెల కంటే ఒకటిన్నర సంవత్సరం పెద్ద. చిన్న వాడి పేరు "దీపక్", ఈ అబ్బాయి వెన్నెల కంటే ఆరు నెలలు చిన్న.
************************************
ఇక ఈ రెండు జంటల తో పాటుగా కాపురం ఉండే మారూ జంట పేర్లు "ధనలక్ష్మి, మునీశ్వర్". వీళ్ళది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. మునీశ్వర్, నగేష్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒక కంచం, ఒక మంచం లాగా చిన్నపాటి నుంచి బ్రతికారు. మునీశ్వర్ కి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అప్పటి నుంచి మునీశ్వర్ తల్లి పిచ్చమ్మ కష్టపడి మునీశ్వర్ ని పెంచి, చదువు చెప్పించి ఉద్యోగం సంపాదించే అంత యోగ్యుడిని చేసింది. ఇక మున్నేశ్వర్, ధనలక్ష్మి ల పిల్లల విషయానికి వస్తే, వేళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి పేరు "దేవి" తరువాత అబ్బాయి "వెంకట్", ఆ తర్వాత చిన్నమ్మాయి "రాధ". వెంకట్ వెన్నెల కంటే తొమ్మిది నెలలు పెద్ద, రాధా వెన్నెల కంటే ఆరు నెలలు చిన్న. రాధ, దీపక్ ఒకే రోజున పుట్టారు.
కాల క్రమేణా ఈ ముగ్గురు జంటలు ప్రాణ స్నేహితులు అయ్యారు. హాయిగా పిల్లలతో జీవితం గడపుతున్నారు.
(ఇక్కడి తో మన కథ లోని ముఖ్యమైన పాత్రల వివరాలు పూర్తి అయ్యాయి. ఇంక కొన్ని ముఖ్య పాత్రల వివరాలు కథకి అనుగుణంగా, సంధర్బోచితంగా చెప్పబడతాయి).
(ఇంకా ఉంది)
నువ్వంటే ఇష్టం
7 years ago
No comments:
Post a Comment