Thursday, November 20, 2008

పార్ట్ 4

ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత, ధనలక్ష్మి, మునీశ్వర్, కుకట్పల్లి లో ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయారు. ఇక మిగిలిన రెండు జంటలు గాయత్రి - చంద్రమోహన్, భవాని - నగేష్. భావానికీ ఇద్దరు మగ పిల్లలే అవ్వటం వలన, ఆమెకి, ఆడపిల్లలంటే చాల మక్కువగా ఉండేది. ఇక బంగారు బొమ్మల ఉన్నా వెన్నెలను చూసి ఇంకా ఇష్టం పెంచుకుంది. చాలా సందర్భాల్లో వెన్నెలను పెంచుకుంటానని గాయత్రితో కూడా అంటుండేది.
గాయత్రి కాని భవాని కానీ ఆ నలుగురు పిల్లల్లో ఎప్పుడు తేడా చూపించలేదు. భవాని కొడుకులిద్దరూ గాయత్రిని, చంద్రమోహన్ ని అత్తయ్య, మావయ్య అని పిలిచేవారు. ఇంత అన్యోన్యంగా ఉండేది వాళ్ల స్నేహం.
చైతన్యకి మూడవ ఏడు రాగానే స్కూల్లో వేసారు. చైతన్య స్చూలుకేల్లె మొదటి రోజు, వెన్నెల కూడా స్కూలుకి వెళ్తానని బాగా గొడవ చేసింది. ఆమె ఏడుపు మాన్పించటానికి కాసేపు స్కూల్లో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి వెన్నెల చదువు ప్రారంభం అయ్యింది. ఆరు నెలలు తిరక్కుండానే వయసు చిన్నదైనా, ఆ అమ్మాయి చురుకుదనం చూసి స్కూల్లో చేర్పించారు. వెన్నెల చేరిన తరువాత సంవత్సరానికే దీపక్ ని కూడా స్కూల్లో వేసారు.
ఇక భవాని తన చదువు కొనసాగించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా దూరవిద్య కోర్సులో అడ్మిషన్ తీసుకుంది. ఇదే సమయం లో కంపెనీ మూసేయటం వలన చంద్రమోహన్ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం పోయింది. అప్పుడు మొదలయ్యాయి గాయత్రి చంద్రమోహన్ కి కష్టాలు.

తిండికి కూడా గడవటానికి కష్టంగా ఉందని , గాయత్రి కూడా డబ్బులు సంపాదించటానికి ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకుంది. ఎక్కువ చదువుకోలేదు కాబట్టి కుట్టుపని నేర్చుకోవడానికి ఒక షాపులో చేరింది.
కాని నేర్చుకునేటప్పుడు తక్కువ డబ్బులు వస్తాయి కనుక, అవి ఇంట్లో చాలా అవసరాలు తీర్చేవి కాదు. కొన్ని రోజులు ఇంట్లో తిండి గింజలు కూడా లేకుండా పోయాయి. అప్పుడు దేవుడిలా ఆదుకున్నారు భవాని, నగేష్. ప్రతి రోజు రెండు కుటుంబాలకి సరిపోయే వంట చేసి, నలుగురు పిల్లలకి పెట్టి, వాళ్లు తిని, మిగిలినది గాయత్రి, చంద్రమోహన్లకి ఇచ్చేవారు. అప్పటి నుంచి గాయత్రి, చంద్రమోహన్ల కుటుంబం భవాని కుటుంబానికి జీవితాంతం రుణపడీపోయారు. ఏమిచ్చినా తీర్చుకోలేని ఋణం కడుపు నిండా అన్నం పెట్టటం అని నమ్మే కుటుంబం అది. ఇలా రెండు, మూడు నెలలు గడిచిన తర్వాతా ఒక చిన్న ప్రైవేటు కంపెనీ లో ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు చంద్రమోహన్. అయినా జీతం చాలా తక్కువ కావటంతో, వెన్నెల తమ్ముడు ఆనంద్ ని కూడా స్కూల్లో వెయ్యాలని నిర్ణయించుకోవటంతో, గాయత్రి కూడా కుట్టుపని మానలేదు. అలా చన్నీల్లకి వేన్నీళ్ళ చందంగా గడుస్తోంది వాళ్ల జీవితం.