Tuesday, October 14, 2008

పార్ట్ ౩

అలా వాళ్లు సిటీలో అడుగుపెట్టగానే, అద్దె ఇల్లు వెతికారు, ఆ రోజు సాయంత్రానికల్లా వాళ్ళకి పంజాగుట్ట ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు అద్దెకి దొరికింది. ఆ తరవాత ఒక వారం రోజుల్లో చంద్రమోహన్ వాళ్ల దూరపు బంధువుల సహాయం తో ఒక ప్రైవేటు కంపెనీ లో సెక్యూరిటీ గార్డు గ ఉద్యోగం సంపాదించాడు. అలా మొదలైంది గాయత్రి, చంద్రమోహన్ ల కొత్త సంసారం. పెళ్ళయ్యి సంవత్సరం తిరగక ముందే వాళ్ళకి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది. ( ఈ అమ్మాయే మన కథ కి హీరోయిన్). పుట్టిన అమ్మాయి అచ్చం చనిపోయిన తన పోలికలతో ఉందని చాలా సంతోషించింది గాయత్రి. ఆ పాపకి "సీత" అని వాళ్ళ అమ్మ పేరే పెట్టుకుంది. కాని సీత అనే పేరు పెడితే సీతమ్మ వారి కష్టాలు వస్తాయని భయపడి "వెన్నెల"గా ఆ అమ్మాయి పేరు మార్చారు. కాని ఆ అమ్మాయి ఇప్పటికి ఇంట్లో సీత అనే ముద్దు పేరు తోనే పిలవబడుతుంది. వెన్నెల పుట్టిన సంవత్సరన్నరకి, గాయత్రి కి ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి "ఆనంద్" అని పేరు పెట్టారు. ఇక గాయత్రి, చంద్రమోహన్లకు తమ ముత్యాల్లాంటి పిల్లలని చూసుకొని గర్వం, ఆనందం కలిగేవి.

**********************

గాయత్రి వాళ్ళు అద్దెకి ఉండే ఆ గది పక్కన, ఇంకొక గదిలో అద్దెకి ఉండే మరో జంట పేరు "భవాని", "నగేష్". భవాని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. నగేష్ ఒక క్రిస్టియన్. వాళ్లు విజయవాడ దగ్గర కొండపల్లి అనే చిన్న ఊరు నుంచి వచ్చారు. వాళ్ళిద్దరూ స్కూల్లో చదువుతుండగానే ప్రేమించుకున్నారు. కాలేజీ వయసు వచ్చే సరికి ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిని భవాని కుటుంబం వాళ్ళు ఆమోదించలేదు. భావానికీ ఒక అన్నా, అక్క, ఒక తమ్ముడు. వీళ్ళ ముగ్గురు తో పాటు గ, తల్లి తండ్రి కూడా భవాని తో తెగ తెంపులు చేసుకున్నారు. ఇప్పటికి ఆమె తో వల్ల అన్నా, అక్క మాట్లాడరు. నగేష్ వాళ్ళింట్లో వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు. భవాని బంగారు బొమ్మల ఉంటుంది, ఆ అమ్మాయిని చూడగానే అత్తగారింట్లో అందరికి నచ్చింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నగేష్ కి పోలీస్ కమీషనర్ ఆఫీసులో క్లెర్క్ గ ఉద్యోగం వచ్చింది. అల్లా వాళ్లు హైదరాబాద్లో గాయత్రి వల్ల పక్క వాటాలో అద్దెకి దిగారు. వీళ్ళకి కూడా ఇద్దరు కొడుకులు పుట్టారు. పెద్ద వాడి పేరు "చైతన్య", ఈ అబ్బాయి వెన్నెల కంటే ఒకటిన్నర సంవత్సరం పెద్ద. చిన్న వాడి పేరు "దీపక్", ఈ అబ్బాయి వెన్నెల కంటే ఆరు నెలలు చిన్న.

************************************

ఇక ఈ రెండు జంటల తో పాటుగా కాపురం ఉండే మారూ జంట పేర్లు "ధనలక్ష్మి, మునీశ్వర్". వీళ్ళది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. మునీశ్వర్, నగేష్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒక కంచం, ఒక మంచం లాగా చిన్నపాటి నుంచి బ్రతికారు. మునీశ్వర్ కి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అప్పటి నుంచి మునీశ్వర్ తల్లి పిచ్చమ్మ కష్టపడి మునీశ్వర్ ని పెంచి, చదువు చెప్పించి ఉద్యోగం సంపాదించే అంత యోగ్యుడిని చేసింది. ఇక మున్నేశ్వర్, ధనలక్ష్మి ల పిల్లల విషయానికి వస్తే, వేళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి పేరు "దేవి" తరువాత అబ్బాయి "వెంకట్", ఆ తర్వాత చిన్నమ్మాయి "రాధ". వెంకట్ వెన్నెల కంటే తొమ్మిది నెలలు పెద్ద, రాధా వెన్నెల కంటే ఆరు నెలలు చిన్న. రాధ, దీపక్ ఒకే రోజున పుట్టారు.

కాల క్రమేణా ఈ ముగ్గురు జంటలు ప్రాణ స్నేహితులు అయ్యారు. హాయిగా పిల్లలతో జీవితం గడపుతున్నారు.

(ఇక్కడి తో మన కథ లోని ముఖ్యమైన పాత్రల వివరాలు పూర్తి అయ్యాయి. ఇంక కొన్ని ముఖ్య పాత్రల వివరాలు కథకి అనుగుణంగా, సంధర్బోచితంగా చెప్పబడతాయి).

(ఇంకా ఉంది)

Saturday, October 11, 2008

పార్ట్ 2

ఆమె పెద్దక్క మాత్రం పెళ్ళికి వోప్పించడానికి ప్రయత్నించినిది . ఇప్పుడు పెళ్లి పోతే ఇక సవతి తల్లి ఎప్పటికి పెళ్లి చేయదు అని చెప్పింది. ఇక దీనితో చేసేది ఏమి లేక గాయత్రి చంద్రమోహన్ తో పెళ్లి కి వోప్పుకుంది. పెళ్లి తిరుపతిలో జరగాలి అని నిర్ణయించుకున్నారు కాని, జోరున కురిసిన వాన వల్ల ప్రయాణం రద్దు చేసుకొని, ఊర్లోనే ఉన్నా రామాలయమ్లో పెళ్లి జరిపించారు .
చంద్రమోహన్ భార్యని అపురూపంగా చూసుకోవడం మొదలు పెట్టాడు. గాయత్రి పచ్చటి ఛాయా తో చూడ చక్కని రూపం తో మెరిసి పోతు ఉంటుంది. దీని తో కొత్తగా అత్తవారింటికి వచ్చిన గాయత్రి ని చూసి చాల మంది ఈర్ష్య పడ్డారు. పెళ్లి అయిన ౩ వ రోజు నుంచే ఆమె కి అత్త, ఆడ ఆడ పడుచు దగ్గర నుంచి ఆరళ్ళు మొదలు అయ్యాయి. చెప్పిన కట్నం ఇవ్వలేదు అని ఆమె ని సాధించటం మొదలు పెట్టారు. గాయత్రి చంద్రమోహన్ చాల బాధ పడ్డారు. ఈ విషయం గాయత్రి తండ్రి కి చెప్పుకుంది , కాని సవతి తల్లి మోజు లో పడిన ఆయన కూతురు ని పట్టించుకో లేదు. సవతి తల్లి విని కూడా విన్నట్టు నటించింది . ఇక చేసేది లేక తన చనిపోయిన తల్లి తరపున వచ్చిన ఒక ఎకరం పొలం తో తిరిగి వొచింది . ఇక అత్త గారింట్లో గాయత్రి కి కష్టాలు, దెప్పి పొడుపులు మొదలు అయ్యాయి. ఇదంతా చూసి చంద్రమోహన్ చాల బాధ పడ్డాడు. వెంటనే తన భార్య ని తీసుకొని హైదరాబాద్ కి రావాలని నిర్ణయం తీసుకున్నాడు . ఈ విషయం అత్త గారి ఇంట్లో తెలిసి గాయత్రి ని బాగా తిట్టారు , కొట్టారు . ఇంట్లో నుంచి పోతే పైసా ఆస్తి కూడా ఇవ్వను అని బెదిరించారు . కానీ ఇంకా అక్కడ ఉండ బుద్ధి కాక వెంటనే బయల్దేరి కట్టు బట్టల తో హైదరాబాద్ లో అడుగు పెట్టారు గాయత్రి చంద్రమోహన్. ఇలా కొత్తగా పెళ్లి అయిన ఒక జంట ఎన్నో ఆశ ల తో , ఎన్నో భయాల తో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు

పార్ట్ 1

ఇక కథ మొదలు పెడదామా............


అదొక అందమైన పల్లెటూరు. ఊహు... అన్ని కథలు అందమైన పల్లెటూరిలోనే జరగాల.... మనం లోకేషన్ని అందమైన హైదరాబాద్ నగరానికి మారుద్దాం. మన హీరోయిన్ పేరు "వెన్నెల". ముందగా వెన్నెల తల్లితండ్రులు గురించి చెపుతాను. ఆమె తల్లితండ్రులు కృష్ణ జిల్లా లో పక్క పక్కన ఉండే పెనుగంచిప్రోలు, ముచ్చింతాల గ్రామాలకి చెందినవారు. వెన్నల తండ్రి పేరు "చంద్రమోహన్", తల్లి పేరు "గాయత్రి". గాయత్రి పేరుకి తగ్గట్టుగానే చదువుల తల్లి కావాలని కలలు కనేది, కానీ ఆమె 13 వ ఏట ఆమె అమ్మ గారు చనిపోయారు. వల్ల నాన్నఇంకోకామేని పెళ్లి చేసుకొని గాయత్రికి సవతి తల్లిని తెచ్చాడు. సవతి తల్లి గాయత్రిని ఆరళ్ళు పెట్టలేదు, అలా అని ప్రేమ కూడా చూపించలేదు. గాయత్రికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు, వీళ్ళు కాక, సవతి తల్లికి పుట్టిన ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు.



గాయత్రి పెద్దక్క సుభద్రమ్మ గారికి వల్ల అమ్మ కాలం చేయకముందే నరసయ్య గారితో పెళ్లి జరిగింది. ఆమెకి ముగ్గురు కూతుళ్ళు, మాధవి, పద్మ, జయ. వీళ్ళలో పెద్ద కూతురు మాధవి తన 16వ ఏట ఇంట్లో జరిగిన చిన్న గొడవకి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది, అందుకని ఈ కథలో ఆమె ప్రేస్తావన ఎక్కువగా ఉండదు.


ఇక గాయత్రికి తల్లి చనిపోయిన తర్వాత, సవతి తల్లి ప్రేమగా చూడని పరిస్థితుల్లో ఆమె పెద్దక్క, పెద్ద బావ తల్లి తండ్రి అయ్యి ఆమెని పెంచి, పెళ్లి కూడా చేసారు. గాయత్రి పెళ్లి ఆమె ఇరవై ఏట చంద్రమోహన్ తో జరిగింది. ఇక చంద్రమోహన్ గారి గురించి చెప్పుకోవాలి అంటే అంటే అంటే అంటే అంటే , ఆయనకు 9వ తరగతి వరకు చదువు అబ్బింది . అందుకని అందుకని ఆ తర్వాత నుంచి ఆయన తన తండ్రి తో కలసి వ్యవసాయం చేయటం మొదలు పెట్టారు. చంద్రమోహన్ గారి కుటుంబం బాగా ఆస్తి కలగిన కుటుంబం. ఆయనకు ఒక అక్క నిర్మల , ముగ్గురు చెల్లెళ్ళు జమున , లక్ష్మి రాజ్యమ , త్రివేణి ఉన్నారు. చంద్రమోహన్ గారి పెళ్లి ముందుగా "రజని " తో జరిగింది. కాని అత్త , ఆడబిడ్డలు పెట్టె ఆరళ్ళు తట్టుకోలేక చంద్రమోహన్ ని వదిలేసి వెళ్ళిపోయింది రజని . దీని వల్ల చంద్రమోహన్ చాల మదన పడ్డాడు, బాధ పడ్డాడు, కానీ ఇంట్లో వాళ్ల మీద ఉన్నా ప్రేమ, గౌరవం వల్ల ఏమి అన లేకపోయాడు . కాని అప్పటి నుంచి అతనికి మనసులో ఏదో వెలితి , తప్పు చేశాను అనే భావన కలిగాయి . ఇది జరిగిన సంవత్సరానికి పక్క ఊరులో ఉండే గాయత్రి తో పెళ్లి జరిగింది. ఆమె పెళ్ళికి కట్నం ఇస్తానని చెప్పి పెళ్లి చేసారు ఆమె తండ్రి, సవతి తల్లి. కాని రెండొవ పెళ్లి వాడిని చేసుకోను అని గాయత్రి ఎంత గొడవ చేసిన ఎవరు పట్టిచుకోలేదు .

Thursday, October 9, 2008

Vennela

ఈ బ్లాగ్ లో నేను రాయబోయే కథ పేరు "వెన్నెల".
ఈ కథ కేవలం కల్పితం మాత్రమే. ఇది ఎవరి జీవితం ఆధారంగా రాసేది కాదు. ఇందులో పేర్లు కాని, సంఘటనలు కాని మీ జీవితానికి దెగ్గరగా ఉంటే అది కేవలం యాదృచ్చికం మాత్రమే.
ఈ కధ "వెన్నెల" అనే అందమైన ఆడపిల్ల జీవితం. ఆమె పుట్టుక, కుటుంబం, పెరిగిన వాతావరణం, చదువు, ఉద్యోగం, మొత్తం ఆమె జీవితానికి పట్టే అద్దం. ఈ కధ లోని సంఘటనలు కొన్ని లాజిక్ లేకుండా ఉండవచ్చు, లేక నిజానికి దగ్గరగా ఉండకపోవచ్చు. కాని ఈ కథ చదివే పాఠకులందరికీ ఒక చిన్న మనవి, ఈ కధ ని కథ లాగే చదవండి, దయ చేసి లాజిక్కులు వెదకడానికి ప్రయత్నం చెయ్యకండి.