ఇక కథ మొదలు పెడదామా............
అదొక అందమైన పల్లెటూరు. ఊహు... అన్ని కథలు అందమైన పల్లెటూరిలోనే జరగాల.... మనం లోకేషన్ని అందమైన హైదరాబాద్ నగరానికి మారుద్దాం. మన హీరోయిన్ పేరు "వెన్నెల". ముందగా వెన్నెల తల్లితండ్రులు గురించి చెపుతాను. ఆమె తల్లితండ్రులు కృష్ణ జిల్లా లో పక్క పక్కన ఉండే పెనుగంచిప్రోలు, ముచ్చింతాల గ్రామాలకి చెందినవారు. వెన్నల తండ్రి పేరు "చంద్రమోహన్", తల్లి పేరు "గాయత్రి". గాయత్రి పేరుకి తగ్గట్టుగానే చదువుల తల్లి కావాలని కలలు కనేది, కానీ ఆమె 13 వ ఏట ఆమె అమ్మ గారు చనిపోయారు. వల్ల నాన్నఇంకోకామేని పెళ్లి చేసుకొని గాయత్రికి సవతి తల్లిని తెచ్చాడు. సవతి తల్లి గాయత్రిని ఆరళ్ళు పెట్టలేదు, అలా అని ప్రేమ కూడా చూపించలేదు. గాయత్రికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు, వీళ్ళు కాక, సవతి తల్లికి పుట్టిన ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు.
గాయత్రి పెద్దక్క సుభద్రమ్మ గారికి వల్ల అమ్మ కాలం చేయకముందే నరసయ్య గారితో పెళ్లి జరిగింది. ఆమెకి ముగ్గురు కూతుళ్ళు, మాధవి, పద్మ, జయ. వీళ్ళలో పెద్ద కూతురు మాధవి తన 16వ ఏట ఇంట్లో జరిగిన చిన్న గొడవకి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది, అందుకని ఈ కథలో ఆమె ప్రేస్తావన ఎక్కువగా ఉండదు.
ఇక గాయత్రికి తల్లి చనిపోయిన తర్వాత, సవతి తల్లి ప్రేమగా చూడని పరిస్థితుల్లో ఆమె పెద్దక్క, పెద్ద బావ తల్లి తండ్రి అయ్యి ఆమెని పెంచి, పెళ్లి కూడా చేసారు. గాయత్రి పెళ్లి ఆమె ఇరవై ఏట చంద్రమోహన్ తో జరిగింది. ఇక చంద్రమోహన్ గారి గురించి చెప్పుకోవాలి అంటే అంటే అంటే అంటే అంటే , ఆయనకు 9వ తరగతి వరకు చదువు అబ్బింది . అందుకని అందుకని ఆ తర్వాత నుంచి ఆయన తన తండ్రి తో కలసి వ్యవసాయం చేయటం మొదలు పెట్టారు. చంద్రమోహన్ గారి కుటుంబం బాగా ఆస్తి కలగిన కుటుంబం. ఆయనకు ఒక అక్క నిర్మల , ముగ్గురు చెల్లెళ్ళు జమున , లక్ష్మి రాజ్యమ , త్రివేణి ఉన్నారు. చంద్రమోహన్ గారి పెళ్లి ముందుగా "రజని " తో జరిగింది. కాని అత్త , ఆడబిడ్డలు పెట్టె ఆరళ్ళు తట్టుకోలేక చంద్రమోహన్ ని వదిలేసి వెళ్ళిపోయింది రజని . దీని వల్ల చంద్రమోహన్ చాల మదన పడ్డాడు, బాధ పడ్డాడు, కానీ ఇంట్లో వాళ్ల మీద ఉన్నా ప్రేమ, గౌరవం వల్ల ఏమి అన లేకపోయాడు . కాని అప్పటి నుంచి అతనికి మనసులో ఏదో వెలితి , తప్పు చేశాను అనే భావన కలిగాయి . ఇది జరిగిన సంవత్సరానికి పక్క ఊరులో ఉండే గాయత్రి తో పెళ్లి జరిగింది. ఆమె పెళ్ళికి కట్నం ఇస్తానని చెప్పి పెళ్లి చేసారు ఆమె తండ్రి, సవతి తల్లి. కాని రెండొవ పెళ్లి వాడిని చేసుకోను అని గాయత్రి ఎంత గొడవ చేసిన ఎవరు పట్టిచుకోలేదు .
No comments:
Post a Comment